ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవతో నూతన షాదిఖాన కమిటీ ఏర్పాటు

మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కృషి అభినందనీయం

సింగరేణిలో షాదిఖాన అభివృద్ధికి నూతన కమిటీ నియామకం
Published On
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవతో నూతన షాదిఖాన కమిటీ ఏర్పాటు

 

 

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి , ఆగస్టు 24 (లోకల్ గైడ్) :

రాష్ట్ర ప్రభుత్వం, వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు సింగరేణి మండలంలో నూతన షాదిఖాన కమిటీని నియమించారు. నూతన కమిటీ సభ్యులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సింగరేణి మండల మెజిస్ట్రేట్, రెవెన్యూ అధికారికి ఓరుగంటి వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైరా నియోజకవర్గ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా షాదిఖాన వంటి సౌకర్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే చొరవ చూపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గాల ప్రజలకు వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు షాదిఖాన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, నూతన కమిటీ ఆధ్వర్యంలో దాని నిర్వహణను మరింత మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. షాదిఖానకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, నిర్వహణపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

నూతన కమిటీ వివరాలు:

చైర్మన్‌గా ఎండీ యాకుబ్ అలీ, వైస్ చైర్మన్‌గా షేక్ మజీద్ పాషా (షేరు), కార్యదర్శిగా ఎండీ సల్మా, సభ్యులుగా షేక్ యాకుబ్ పాషా, షేక్ ఖదీర్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు, సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ), మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ హనీఫ్, నాయకులు బద్దులాల్, షేక్ షఫీ, షేక్ సద్దాం హుస్సేన్, షేక్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News