- District News
- ప్రకృతికి రాఖీ: నర్సంపేటలో వినూత్న రక్షాబంధన్
ప్రకృతికి రాఖీ: నర్సంపేటలో వినూత్న రక్షాబంధన్
చెల్లికి కాదు, చెట్టుకు రాఖీ: ఐదేళ్లుగా వృక్షా బంధన్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ నర్సంపేట ప్రతినిధి ఆగస్టు 28 :
చెట్టు మనకు ఏమిస్తుంది?
“చెట్టు మనకి కర్రనిస్తుంది, ప్రాణవాయువు (ఆక్సిజన్) ఇస్తుంది, ఎండలో నీడనిస్తుంది. తిరిగి మన నుండి ఏమీ ఆశించదు. అలాంటి చెట్టును మనం కాపాడుకోవద్దా? చెల్లి తన అన్న రక్షణ కోసం రాఖీ కట్టినట్లు, మనం కూడా వృక్ష రక్షణ కోసం రాఖీ కట్టాలి” అని ఆ వనప్రేమి పేర్కొన్నారు.
ఐదేళ్లుగా ఆనవాయితీ:
ఇది ఒక్కరోజు ఆలోచన కాదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి రాఖీ పండుగ రోజున నర్సంపేటలోని చెట్లకు రాఖీలు కట్టడం, వాటిని ఆలింగనం చేసుకోవడం ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు. చెట్టును కేవలం మొక్కగా కాకుండా, తన కుటుంబ సభ్యురాలిగా, చెల్లిగా భావించి ఆత్మీయ బంధాన్ని పంచుతున్నారు.
మేధావుల ప్రశంస:
“చెల్లిని ఏ విధంగా ఆదరిస్తామో, మొక్కలను కూడా అదే విధంగా ఆదరించాలి. నీ చెల్లికి ఏ విధంగా ఆత్మీయ బంధాన్ని అందిస్తావో, ఆ విధంగా వృక్షానికి కూడా అందించాలి. ఇది ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా తమ అన్నా చెల్లెళ్ల సంస్కారాన్ని ఏర్పరుచుకోవడమే” అని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
చెట్టును నరకడం కాదు, చెట్టును కౌగిలించుకోవడం మన ధర్మం అని చేసి చూపిస్తున్న ఈ వనప్రేమి చర్యను నర్సంపేట ప్రజలు, మేధావులు, పర్యావరణ ప్రేమికులు అభినందిస్తున్నారు.
ఒకవైపు విచ్చలవిడిగా చెట్లను నరుకుతున్న ఈ రోజుల్లో, చెట్టుకు రాఖీ కట్టి దాని రక్షణ బాధ్యతను తీసుకోవడం నిజంగా హర్షణీయం. ఈ ‘వృక్షా బంధన్’ సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు రాఖీ కట్టాలని ఆయన కోరారు.
Tags:
About The Author
Related Posts
Latest News
09 Sep 2026 13:40:14
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు
