పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా వనమహోత్సవం

గూడూరు సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా

పాఠశాలలో ఏపీడీ చరణ్ తో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దయానంద్ గుప్తా
Published On
పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా వనమహోత్సవం

కొత్తూరు ఆగస్టు 25 (లోకల్ గ్రైడ్)

నాటిన ప్రతి మొక్కను సంరక్షించి గ్రామాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దాలని ప్రజలకు గూడూరు సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా సూచించారు.మంగళవారం కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఏపీడి చరణ్,సర్పంచ్ దయానంద్ గుప్తా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ దయానంద్ గుప్తా మాట్లాడుతూ..ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. చెట్లు సహజసిద్ధమైన ఆక్సిజన్‌ను అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.గ్రామ ప్రజలు వనమహోత్సవ స్ఫూర్తితో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని సర్పంచ్ దయానంద్ గుప్తా  కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ దీపిక,అధికారులు,వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా? మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా?
​రింగ్ రోడ్ కూడలిలో ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులతో నేతల వాగ్వాదం ​అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం
స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ 
రైతు వేదికలో సన్న రకాల వరి సాగు నమోదు పత్రాల స్వీకరణ
రాష్టాన్ని  సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్   ప్రభుత్వం .
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”
దళిత వ్యతిరేకి బీ ఆర్ ఎస్ పార్టీ...అధికారం కోల్పోయామనే అక్కసుతో దళితుల పట్ల సంస్కార హీనంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ ఎంఎల్సీ తాత మధు.
7వ వార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ