ములుగు జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

గడ్డం క్రాంతి కుమార్ అధ్యక్షులుగా ఏకగ్రీవ ఎన్నిక

Published On
ములుగు జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

 

 

ములుగు, లొకల్ గైడ్ :-

ములుగు జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గడ్డం క్రాంతి కుమార్ కానిస్టేబుల్, ఉపాధ్యక్షులుగా తాజుద్దీన్ ఎస్.ఐ.కృష్ణ ప్రసాద్ ఎస్.ఐ,కార్యదర్శిగా దారం సురేష్ కుమార్ ఇన్స్పెక్టర్, జాయింట్ సెక్రటరీగా పసుపులేటి నరేష్ హెడ్ కానిస్టేబుల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా విజయ్ హెడ్ కానిస్టేబుల్, ట్రెజరర్ గా సర్వేశ్వర్ రావు కానిస్టేబుల్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అసోసియేషన్ మరింత కృషి చేయాలని సూచించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు గడ్డం క్రాంతి కుమార్ మాట్లాడుతూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Tags:

About The Author

Latest News