- District News
- Nizamabad
- జీజీహెచ్‌లో దారుణం..
జీజీహెచ్‌లో దారుణం..
ఆస్పత్రి డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం
Published On
By Ram Reddy
నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 05:
మృతి చెందిన ఆ నవజాత శిశువు ఎవరై ఉంటారు..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జీజీహెచ్ ఆస్పత్రి కి నిత్యం వేల సంఖ్యలో రోగులు, వారికి సంబంధించిన వారు వస్తూపోతూ ఉంటారు. రోజూ 1500లకు పైగా ఓపీ ఉంటోంది. అలాగే గర్భిణుల కోసం ప్రత్యేక వార్డు ఉంది. నిత్యం సెక్యూరిటీ సిబ్బంది సైతం పర్యవేక్షిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్పత్రిలో డెలివరీ అయిన ఓ నవజాత శిశువు మృతదేహం డ్రైనేజీలో కనిపించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఆస్పత్రికి వచ్చే ప్రతి గర్భిణి వివరాలు రికార్డుల్లో ఉంటాయి. అలాగే నవజాత శిశువులు జన్మించిన తర్వాత వారి వివరాలు సైతం నమోదు చేస్తారు. అయినప్పటికీ వైద్యసిబ్బందికి, అధికారులకు సమాచారం లేకుండా నవజాత శిశువు మృతదేహం బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారరింది.
జీజీహెచ్‌లో గతంలో గైనిక్, పిడియాట్రిక్కు సంబంధించి విభాగాలు ఉండేవి. అక్కడే డెలివరీలు, పరీక్షలు జరుగుతుండేవి. అయితే బస్టాండ్‌కు ఎదురుగా నిర్మించిన కొత్త భవనానికి ఈ రెండు విభాగాలను మార్చేశారు. సుమారు 12ఏళ్ల వరకు చిన్నారులకు చికిత్సలు, డెలివరీలు, బాలింతలకు సంబంధించిన పరీక్షలన్నీ ఈ కొత్త భవనంలోనే జరుగుతున్నాయి. అయితే డెలివరీ కొత్త భవనంలో జరుగుతుండగా.. జీజీహెచ్ ఆవరణలో నవజాత శిశువు మృతదేహం లభ్యమవడం చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో 60 మంది వరకు సెక్యూరిటీ సిబ్బంది నిత్యం ఆయా విభాగాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీసులు మాట్లాడుతూ.. నవజాత శిశువు మృతదేహం వివరాలు తెలిస్తే 8712659714లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Aug 2026 18:25:34
నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 05:
నిజామాబాదు జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పత్రి ప్రాంగణంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యం...
