రాజీవ్ గాంధీ సేవలు దేశానికి చిరస్మరణీయం

డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

Published On
రాజీవ్ గాంధీ సేవలు దేశానికి చిరస్మరణీయం

 

 


WhatsApp Image 2026-08-20 at 17.22.46 (2)

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను ఆమె స్మరించుకున్నారు.
దేశాన్ని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ, సమాచార సాంకేతిక రంగం అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు దేశ ప్రగతికి ఎంతో దోహదపడ్డాయని అన్నారు. దేశంలో టెలికాం, కంప్యూటర్ రంగాల విస్తరణకు రాజీవ్ గాంధీ తీసుకున్న చర్యలు భవిష్యత్ భారత నిర్మాణానికి బాటలు వేశాయని తెలిపారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఓటు హక్కు కల్పించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాజీవ్ గాంధీ కృషి చేశారని ఆమె గుర్తుచేశారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆలోచనా విధానాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, కౌన్సిలర్ లు గడ్డం రాజు, రమేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,