కలళ ద్వారా సామాజిక చైతన్యానికి పట్టాభిషేకం

పాఠశాల స్థాయి బాల బాలికలు నాటిక పోటీలకు ఇన్నర్ వీల్ క్లబ్ సన్నాహాలు

Published On
కలళ ద్వారా సామాజిక చైతన్యానికి పట్టాభిషేకం

 

 

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు20
(లోకల్ గైడ్ న్యూస్):

హనుమకొండ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నటనా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడంతో పాటు, వారిని బాధ్యతాయుతమైన సమాజ హితులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇన్నర్ వీల్ క్లబ్, వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల పాఠశాల స్థాయి బాలల నాటిక పోటీలను నిర్వహించనున్నామని తెలిపారు వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. నాటికలో పాల్గొనే విద్యార్థులందరూ ఒకే పాఠశాలకు చెందినవారై ఉండాలి. ప్రతి నాటిక 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో ఉండాలి. ముందుగా పాఠశాలల ఆధ్వర్యంలో నాటికలను సిద్ధం చేయాలి. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ ప్రత్యేక న్యాయ నిర్ణేతల బృందం ఆయా పాఠశాలలను సందర్శించి నాటికల నాణ్యతను పరిశీలించి తుది పోటీలకు ఎంపిక చేస్తుంది. కుల వివక్ష నిర్మూలన, మూఢనమ్మకాలు, నరబలి వ్యతిరేకత, ఈవ్‌టీజింగ్‌, బాలికలపై వేధింపుల నివారణ, కలుషిత ఆహారం, ఆరోగ్య భద్రత తదితర సామాజిక చైతన్య అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రథమ బహుమతిగా రూ.10 వేల నగదు, షీల్డ్, ప్రశంసాపత్రం, ద్వితీయ బహుమతిగా రూ.8 వేల నగదు, షీల్డ్, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. ప్రదర్శించిన ప్రతి నాటికకు రూ.5 వేల ప్రోత్సాహక పారితోషికం తో పాటు ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. రిజిస్ట్రేషన్, ఎంట్రీల దాఖలుకు ఆగస్టు 30 చివరి తేదీ కాగా, నాటికల ప్రాథమిక పరిశీలన అక్టోబర్ 15 నుండి 30 వరకు నిర్వహించనున్నారు. తుది నాటిక పోటీలు, బహుమతుల ప్రదాన కార్యక్రమం నవంబర్  12,13,14 తేదీల్లో జరగనుందని తెలియజేశారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,