చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి 

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు 

Published On
చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి 

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 07 (లోకల్ గైడ్) 
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ లోని శ్రీ శ్రీనివాస చేనేత సొసైటీ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. భక్త మార్కండేయ, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చేనేత కార్మికులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, చేనేత సొసైటీ కంపౌండ్ వాల్ కు రూ.10 లక్షలు, పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్ పూర్తి స్థాయి నిర్మాణా పనులకు రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. స్థానిక చేనేత సొసైటీ బకాయిల మాఫీ కోసం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో తనను వినియోగించుకోవాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్, కమీషనర్, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్, ఓదెల దేవస్ధానం చైర్మన్ చీకట్ల మొండయ్య, డైరెక్టర్ సామల యమున హరికృష్ణ, చేనేత సొసైటీ అధ్యక్షురాలు గోలి పద్మ శ్రీనివాస్, కౌన్సిలర్ గాదాసు మంజుల రవి, జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు మేరుగు యాదగిరి, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుండ మురళి, పోపా జిల్లా కార్యదర్శి సామల రాజేంద్ర ప్రసాద్, తుమ్మ రాములు, పల్లా సురేష్, కుమార్ కిషోర్, గోరె మియా, కామని వెంకట రమణ, ఎలిగేటి రమేష్, ఎల్లె రాజు, సామల రాకేష్, లతో పాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News