గుండారంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని సూచించిన మాజీ ఎమ్మెల్యే

Published On
గుండారంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బెజ్జంకి ఆగస్ట్ 18(లోకల్ గైడ్):

బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎలుగుమెట్ల లక్ష్మి, శాన బాగయ్య, గౌరవేని రాజవ్వ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆప్తులను కోల్పోయిన కుటుంబాల బాధను పంచుకున్న రసమయి బాలకిషన్.. విషాద సమయంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటూ, ఆపద సమయంలో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటుకుంటూ బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, గుండారం సర్పంచ్ తాళ్ల భీమయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కత్తి అంజయ్య, మాజీ ఎంపీటీసీ గురువారెడ్డి, ఎలుక దేవయ్య, బొమ్మకంటి రామలింగారెడ్డి, శాన రమేష్, పోతుల హరీష్, సూరం శ్రీకాంత్, కుటుంబ సభ్యులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News