తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీ బోనాల ఊరేగింపులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు
Published On
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు

షాద్‌నగర్ పట్టణంలోని ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల ఉత్సవాలను భక్తి, ఐక్యతతో నిర్వహించడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు పిల్లి శారద శేఖర్, గోపాల్, ఎస్పీ శివ, మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, యుగంధర్, చిన్న యాదగిరి, నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, చీపిరి రవి యాదవ్, బిక్షపతి, చెర్క శివ, అశోక్, బాబా ఘోరీ, మహమూద్, నవీన్, సాయి, అభిలాష్, శ్రీనివాస్ తదితరులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు
ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీ బోనాల ఊరేగింపులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు
ఊపిరితిత్తుల వ్యాధులకు శస్త్రచికిత్స అవసరం లేదు అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీతో కోత లేకుండానే చికిత్స
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. బీసీ హాస్టల్‌కు సర్పంచ్ టోనీ చేయూత
వాజేడు అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించిన - ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.
ఓటు హక్కు పరిరక్షణ బిఎల్ఎల బాధ్యత తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి.