- District News
- ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి చంద్రయ్య,వి రాములు,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన ఝాన్సీ స్వయం సహాయక సంఘం సభ్యులు తమ సంఘంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని,మంచిర్యాల పట్టణానికి చెందిన మహమ్మద్ మక్బూల్ పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం తనకు రావలసిన వాటాను ఇప్పించాలని,నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ వాసులు తమ కాలనీలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని,బెల్లంపల్లి పట్టణానికి చెందిన కొండగొర్ల చంద్రశేఖర్ తమకు కన్నేపల్లి మండలం పోలంపల్లి శివారులో గల భూమి ఆన్ లైన్ లో ఇతరుల పేరిట నమోదు అయిందని, ఈ పొరపాటున సవరించి తమ పేరిట మార్పు చేయాలని,లక్షెట్టిపేట మండలం ఊత్కూర్ కు చెందిన తనుగుల సందీప్ కుమార్,తన భార్య దివ్యాంగులమని,నిరుపేదలమని,తమకు జీవనోపాధి కల్పించాలని,క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్ టు చెందిన ఎం ప్రభావతి తనకు కొంత స్థలం ఉందని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని,వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామానికి చెందిన తగరం పరంజ్యోతి తమ భూమి నిషేధిత జాబితాలో చూపుతోందని,సవరించాలని,దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన శనిగారపు బాపు తమ ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని,భూమి కాగితాలు,ఖరీదైన వస్తువులు,మంచాలు,బట్టలు పూర్తిగా కాలిపోయాయని,తమ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని,ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
