నిబంధనల మేరకే లే అవుట్లకు అనుమతులు జారీ

జిల్లా కలెక్టర్ ప్రియాంక.

Published On
నిబంధనల మేరకే లే అవుట్లకు అనుమతులు జారీ

నారాయణపేట ఆగస్టు 24:
ప్రభుత్వ నిబంధనలను అనుసరించి  లే అవుట్లకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా లే అవుట్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ల అనుమతుల జారీ విష యంలో అధికారులు అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తి స్థాయి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కమిటీ పరిశీ లనకు వచ్చిన జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబం ధించిన 6 లే అవుట్ దర ఖాస్తులపై సంబంధిత శాఖల అధికారుల క్లియ రెన్స్ వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
కమిటీ పరిశీలన అనంత రం 3 లే అవుట్లకు అను మతులు మంజూరు చేయ గా, మరో 3 లే అవుట్ల దర ఖాస్తులనుతిరస్కరించింది. 
లే అవుట్ అనుమతుల జారీ ప్రక్రియలో ఆన్‌లైన్ విధానం తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రక్రియను సులభతరం చేయడం, సమయాన్ని తగ్గించడం, అనవసరమైన భౌతిక సమావేశాలను నివారించడమేనని కలెక్టర్ తెలిపారు.ఆన్‌లైన్‌లో పరి శీలన పూర్తయిన తర్వాత కూడా ప్రతి దరఖాస్తుకు మళ్లీ భౌతిక సమావేశం నిర్వహిస్తే ప్రక్రియ రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ వెరిఫికేషన్ సమ యంలో ఏదైనా అధికారి లేదా కమిటీ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఆ అభ్యంతరాన్ని సిస్టమ్‌లోనే నమోదు చేసే విధానం ఉండాలని సూచించారు.
అభ్యంతరం నమోదైన సందర్భంలో సంబంధిత ఫైల్‌ను తదుపరి స్థాయికి ఆటోమేటిక్‌గా పంపించేలా ప్రక్రియనురూపొందించవచ్చని తెలిపారు. అన్ని శాఖ ల అధికారులు ఆమోదించి న దరఖాస్తులకు మళ్లీ ప్రత్యేకంగా భౌతిక సమావేశం నిర్వహించా ల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లోనే తదుపరి ప్రక్రియకు ఫైల్‌ను పంపించే విధానం అమలు చేస్తే సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని స్పష్టం చేశారు.ఏదైనా అంశంపై అభ్యంతరం ఉన్న దర ఖాస్తులను మాత్రమే భౌతిక సమావేశానికి తీసుకువచ్చి చర్చించి నిర్ణయం తీసుకునే విధానం మరింత సమర్థవం తంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇకపై ప్రతి లే అవుట్‌లోనూ రహదారుల ఇరువైపులా మొక్కలు నాటే నిబంధనను ఖచ్చితం గా అమలు చేయాలని కలె క్టర్ సంబంధిత అధికారుల ను ఆదేశించారు. పర్యావర ణ పరిరక్షణకు, లే అవుట్ల లో పచ్చదనం పెంపొందిం చేందుకు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావే శంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, పంచాయతీరాజ్ ఈఈ అశోక్, నీటిపారుదల శాఖ ఈఈ సాల్మన్, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకట రమణయ్య, డీటీసీపీఓ కిరణ్, కోస్గి, మక్తల్, మద్దూరు టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్): సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి