పట్టభద్రుల ఓటు హక్కును  నమోదు చేసుకోవాలి 

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ 

Published On
పట్టభద్రుల ఓటు హక్కును  నమోదు చేసుకోవాలి 

IMG-20260927-WA0236గండిపేట్, సెప్టెంబర్ 27 లోకల్ గైడ్:

రాబోయే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రక్రియ నమోదు చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం నార్సింగి సర్కిల్ పరిధిలోని ఏ ఎఫ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో టి పి సిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల  ఓటర్ నమోదు ప్రక్రియపై పట్టభద్రుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..... ప్రజాస్వామ్య ప్రక్రియలో గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు.  పట్టభద్రుల ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం గౌరీ సతీష్ మాట్లాడుతూ.... గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడానికి ముందుగా ఓటరుగా నమోదు కావడం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తమ వివరాలను పరిశీలించుకొని అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నాయకులు గ్రాడ్యుయేట్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కల‌కుంట్ల వినోద్ కుమార్ నియామకం .
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో విషాదం: మనస్తాపంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య.
రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్రే బిస్ నివారణకు వ్యాక్సినేషన్‌నే ప్రధాన మార్గం
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి