జల్‌పల్లిలో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఎన్నాళ్ళు ఇబ్బందులు పడాలి. 

డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ఆదేశం. 

Published On
జల్‌పల్లిలో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఎన్నాళ్ళు ఇబ్బందులు పడాలి. 


 మహేశ్వరం,  (లోకల్ గైడ్ ):                                        జలపల్లి లో చాలా రోజులుగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు....? తక్షణమే ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని మాజీ మంత్రి,  మహేశ్వరం ఎమ్మెల్యే ఈ సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జలపల్లి గ్రామస్తులు డ్రైనేజీ సమస్యను ఆమె దృష్టికి తేవడంతో ఈ సమస్యను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జిహేచ్ ఎం సి జోనల్, డిప్యూటీ కమిషనర్లతో ఫోన్ లో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
 జల్‌పల్లి డివిజన్ 65 పరిధిలోని అద్నాన్ కాలనీ, సదత్ కాలనీ, సుధా కాలనీల్లో మంగళవారం ఆమె పర్యటించారు. స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు కాలనీల్లోని సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.  కాలనీల్లో డ్రైనేజీ అవుట్‌లెట్ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. పర్యటన స్థలం నుంచే జోనల్ కమిషనర్,  డిప్యూటీ కమిషనర్ లతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సమస్యకు వెంటనే పరిష్కరించేందుకు ఎస్టిమేషన్ ( ప్రణాళిక) వేసి  వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే మైనారిటీ ప్రజల అంతిమ సంస్కార సమయంలో అవసరమైన నీరు, గదుల నిర్మాణ వసతులు వంటి వాటి కోసం  శ్మశాన వాటికను పర్యవేక్షణ చేశారు.  వాటికి కావలసిన నిధులు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ & రోడ్ల నిర్మాణం అన్ని కాలనీలను కలుపుతూ ఒకే మెయిన్ అవుట్‌లెట్ నిర్మించేలా నిధులు సాంక్షన్ చేయిస్తానని, అలాగే ప్రజలు కోరిన విధంగా ఇంటర్నల్ మెయిన్ రోడ్డు సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.
జల్‌పల్లి మున్సిపాలిటీకి ఆదాయం తక్కువ సమస్యలు ఎక్కువ అని అన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్  రూ. 400 కోట్ల ప్రత్యేక నిధులతో ఇక్కడ వాటర్ పైప్‌లైన్లు, 2 రిజర్వాయర్లు, ఫారెస్ట్ వాకింగ్ ట్రాక్ నిర్మించి ఎంతో అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. జల్‌పల్లి అభివృద్ధికి ప్రభుత్వం కూడా అత్యధికంగా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి,  మాజీ ఎం పి టి సి లు యంజాల జనార్దన్ ,  షేక్ అఫ్జల్ ,మాజీ కౌన్సిలర్ పల్లపు శంకర్ ,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూరెడ్డి గోపాల్ రెడ్డి , సైద్ పటేల్,  వాసు బాబు , పోలేమని నాగేష్ ముదిరాజు , నర్సింగ్ , నవాబ్పేట ఆంజనేయులు , సయ్యద్ అబ్బాస్ , మారుతి , సయ్యద్ ఇద్రీస్ , జిశాన్ , గౌస్ , వినయ్ రెడ్డి , శంకర్ , అద్నాన్ కాలనీ ప్రెసిడెంట్ అబ్రార్ , యాంజాల అర్జున్ , సొసైటీ సభ్యులు, కాలనీవాసులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో  భక్తులు వినాయకుల పూజలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో  భక్తులు వినాయకుల పూజలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ): రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో  భక్తులు వినాయకుల పూజలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయకుల ప్రత్యేక పూజలతో పాటు...
అక్కన్నపేట్ లో ఘనంగా విఘ్నేశ్వరుడు పూజలు.                
జల్‌పల్లిలో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఎన్నాళ్ళు ఇబ్బందులు పడాలి. 
గోపాలపురం తండాలో ఘనంగా అన్నదానం
గాదెపాడులో ఘనంగా అన్నదానం
శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ  
క్రషర్‌ నిలిపివేయాలంటూ  నిరాహార దీక్షలు