క్రషర్‌ నిలిపివేయాలంటూ  నిరాహార దీక్షలు

ఆకుతోటపల్లి అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Published On
క్రషర్‌ నిలిపివేయాలంటూ  నిరాహార దీక్షలు

లోకల్ గైడ్ ఆమనగల్లు, సెప్టెంబర్ 22:
రంగారెడ్డి జిల్లా
ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో క్రషర్‌, మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. గ్రామ పరిధిలోని 302, 304 సర్వే నంబర్లలో జరుగుతున్న మైనింగ్‌ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఆమనగల్లు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్షలు కొనసాగించారు.
గ్రామంలో క్రషర్‌, మైనింగ్‌ కార్యకలాపాల కారణంగా పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలుగుతున్నాయని దీక్షా శిబిరం వద్ద గ్రామస్తులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మైనింగ్‌ కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరాహార దీక్షలో శ్రీపతి శశిధర్‌ రెడ్డి, మాజీ కోఆప్షన్‌ సభ్యులు మహమ్మద్‌ హాజీ, వార్డు సభ్యులు షేక్‌ సాజిద్‌, తెలగామల్ల విజయ్‌, షేక్‌ కాజమ్‌ తదితరులు పాల్గొన్నారు. క్రషర్‌ కార్యకలాపాలు నిలిచే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు.

Tags:

About The Author

Latest News

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ   శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ  
          జనగామ పట్టణంలో గుండ్లగడ్డ కిష్టబావి 9వ రోజు గణేష్  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అన్నప్రసాద వితరణ   కార్యక్రమానికి దాత:- మెట్టు సురేష్,వందన, దుబ్బాక బాలయ్య, పద్మ,
క్రషర్‌ నిలిపివేయాలంటూ  నిరాహార దీక్షలు
విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం
భైంసాలో ఘనంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం
ఎన్ఎస్ఎస్ఆధ్వర్యంలో ప్రభుత్వజూనియర్ కళాశాల మధిర ఏక్ పెడ్ మాకే నామ్ 2వరోజుప్రోగ్రాం
భాజపా టీచర్స్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. నెల్లూరి బెనర్జీ
నరసన్న పల్లి పాఠశాలలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన