ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత హోమియోపతి వైద్య శిబిరం

82 మందికి ఆరోగ్య పరీక్షలు.. ఉచితంగా హోమియోపతి మందుల పంపిణీ

Published On
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత హోమియోపతి వైద్య శిబిరం

 

లోకల్ గైడ్ ఆమనగల్లు, సెప్టెంబర్ 21:
11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని 
రంగారెడ్డి జిల్లా
ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి హోమియోపతి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆమనగల్లు పట్టణంలోని 15వ వార్డు శివాలయం నగర్‌లో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
స్థానిక కౌన్సిలర్ ఎంగలి భాగ్యలక్ష్మి రఘు ముఖ్యఅతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దొంతు శ్రీకాంత్ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలను పరిశీలించి అవసరమైన వారికి ఉచితంగా హోమియోపతి మందులను పంపిణీ చేశారు. శిబిరంలో సుమారు 82 మంది ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్య సేవలు పొందారు.
ఈ సందర్భంగా డాక్టర్ దొంతు శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడమే ఇటువంటి శిబిరాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
వైద్య బృందానికి సత్కారం
వైద్య శిబిరం అనంతరం శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ దొంతు శ్రీకాంత్, ఫార్మసిస్ట్ సత్యలను శాలువాలతో సత్కరించి అభినందించారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించిన వైద్య బృందానికి అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో శివశక్తి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంగలి తరుణ్, ఎంగలి యాదగిరి, యోగ ఇన్‌స్పెక్టర్లు ఉమాపతిగౌడ్, లక్ష్మి, సీనియర్ రిపోర్టర్ కోట్ల వెంకటేష్, నవీన్ కుమార్, తరుణ్ నాయక్, గుద్దేటి శివ, అరుణ్ నాయక్, గజ్జ మల్లేష్ గౌడ్, జల్ద అక్షయ్, సందర్శగౌడ్, జల్ద ఆకాష్, ఎంగలి శ్రీధర్, గుద్దేటి మహేష్, గజ్జ నరసింహ, గుర్రం కన్న, కోట్ల గౌతమ్, గజ్జ మనోజ్ గౌడ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం