- District News
- Ranga Reddy
- శంషాబాద్ పల్ మాకుల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
శంషాబాద్ పల్ మాకుల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
కల్వర్టును ఢీ కొట్టిన ఇన్నోవా కార్ నలుగురి మృతి.
Published On
By Ram Reddy
శంషాబాద్:సెప్టెంబర్19( లోకల్ గైడ్ ప్రతినిధి)
చోటుచేసుకుంది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు... మహబూబ్నగర్ జిల్లా,నవాబ్ పేట్ మండల్ మెట్టుగూడ తాండాకు చెందిన కేతావత్ లింబ్య (54) తన కుటుంబ సభ్యులతో కలిసి టీఎస్07జి జెడ్ 9333 నంబర్ గల ఎన్నోవా వాహనంలో స్వగ్రామం నుండి హైదరాబాదుకు బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల్
పాలమాకుల గ్రామం వద్దకు రాగానే వేగంగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు ఐ యి పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కేతావత్ లింబ్య (54)తోపాటు కేతావత్ జామున (45)కేతావత్ మన్సింగ్ (48)కేతావత్ వాసరామ్ (45) సంఘటన స్థలంలో మృతిచెందారు. కారు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయ
పడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే శంషాబాద్ పోలీసుల సంఘటన చేరుకుని చికిత్స నిమిత్తం డ్రైవర్ను ఓ ప్రైవేటు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘట్నాసలంలో మృతి చెందిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా అజాగ్రత్తగా కారు నడపడమే ఈ ప్రమాదాన్ని కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే ముత్తు వల్ల కుటుంబ సభ్యులకు బంధువులకు విషయాన్ని పోలీసులు చేరవేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.Tags:
About The Author
Related Posts
Latest News
19 Sep 2026 10:51:40
శంషాబాద్:సెప్టెంబర్19( లోకల్ గైడ్ ప్రతినిధి)
శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల గ్రామం వద్ద శనివారం ఉదయం 6 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి
