ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలి

చలో శంషాబాద్‌ – కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

Published On
ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలి

IMG-20261002-WA0356IMG-20261002-WA0357

లోకల్‌ గైడ్‌ ఆమనగల్లు, అక్టోబర్‌ 2:

కేంద్ర ప్రభుత్వం ఓబీసీల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్‌ 4న శంషాబాద్‌లో నిర్వహించనున్న ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ సూచనల మేరకు టీపీసీసీ ఓబీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఓబీసీలను తరలించాలని ఆయన కోరారు.

శుక్రవారం ఆమనగల్లు మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, ముఖ్య నాయకులతో ఓబీసీ సింహగర్జన సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేసి శంషాబాద్‌ సభకు తరలించి విజయవంతం చేయాలని నాయకులకు సూచించారు.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేకంగా ఒక కాలమ్‌ కేటాయించి కులగణన చేపట్టాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. ఓబీసీల జనాభా లెక్కలు తేలితేనే వారికి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఓబీసీల విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ బీసీల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ నిలబడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సమావేశంలో టీపీసీసీ సభ్యులు రాయల శ్రీనివాస్‌గౌడ్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, సమావేశం సమన్వయకర్త శివారెడ్డి, కల్వకుర్తి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు రఘురాములు, వెంకటేష్‌, మోత్యానాయక్‌, వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్‌, కడ్తాల్‌ మండల అధ్యక్షుడు శంకర్‌, ఆమనగల్లు మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తలకొండపల్లి మండల అధ్యక్షుడు కాసు శ్రీనివాస్‌రెడ్డి, వెల్దండ మండల అధ్యక్షుడు హరికిషన్‌నాయక్‌, కల్వకుర్తి మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఆమనగల్లు మున్సిపల్‌ అధ్యక్షుడు శివలింగం, కల్వకుర్తి మున్సిపల్‌ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్‌తో పాటు యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్టీ సెల్‌, ఎస్సీ సెల్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలి ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలి
లోకల్‌ గైడ్‌ ఆమనగల్లు, అక్టోబర్‌ 2: కేంద్ర ప్రభుత్వం ఓబీసీల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్‌ 4న శంషాబాద్‌లో నిర్వహించనున్న ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం...
తెలంగాణ ప్రదాత కేసీఆర్‌కు పాలాభిషేకం
లింగంపల్లిలో ఘనంగా గాంధీ జయంతి గ్రామసభ
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి యత్నం నిందితుడిపై కేసు నమోదు, పరారీలో నిందితుడు
గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న  - మానవత్వం 
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు