తెలంగాణ ప్రదాత కేసీఆర్‌కు పాలాభిషేకం

కేసీఆర్ సంక్షేమ పాలన మళ్లీ రావాలి  మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా కార్యక్రమం

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Published On
తెలంగాణ ప్రదాత కేసీఆర్‌కు పాలాభిషేకం

 

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 2( లోకల్ గైడ్)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొని ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సేవలను స్మరిస్తూ ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక మహిళలు కలిసి క్షీరాభిషేకం (పాలాభిషేకం) చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ రాజీలేని సుదీర్ఘ పోరాటం చేశారని కొనియాడారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దేశం గర్వించే రీతిలో అనేక విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ముఖ్యంగా 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన పేదింటి ఆడబిడ్డల భరోసా ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు విజయవంతంగా కొనసాగుIMG-20261002-WA0288తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి గడపకూ చేరి జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు.

హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను తక్షణమే పూర్తిస్థాయిలో నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పాలనలో విసిగిపోయిన ప్రజలు కేసీఆర్ సంక్షేమ పాలనను గుర్తుచేసుకుంటున్నారని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఏ ఒక్క వార్డులోనూ చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని, వార్డుల్లో ప్రారంభోత్సవ శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయని మండిపడ్డారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం, ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలోనే ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు జెర్కొని మమత రాజు, నీలం శ్వేత బాలు, బుగ్గరాములు, మంద జయ మహేష్, కొండ్రు శ్రీలత రాంబాబు, సర్పంచ్ శృతి కరుణాకర్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్‌ఎస్ యువజన నాయకులు జెర్కొని రాజు, మాజీ ఎంపీటీసీ సుకన్య శేఖర్ రెడ్డి, చీరాల రమేష్, శారద, అనసూయ, జయమ్మ, మహేష్, కరుణాకర్, సోహైల్,  నాయకులు, కార్యకర్తలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలి ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలి
లోకల్‌ గైడ్‌ ఆమనగల్లు, అక్టోబర్‌ 2: కేంద్ర ప్రభుత్వం ఓబీసీల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్‌ 4న శంషాబాద్‌లో నిర్వహించనున్న ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం...
తెలంగాణ ప్రదాత కేసీఆర్‌కు పాలాభిషేకం
లింగంపల్లిలో ఘనంగా గాంధీ జయంతి గ్రామసభ
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి యత్నం నిందితుడిపై కేసు నమోదు, పరారీలో నిందితుడు
గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న  - మానవత్వం 
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు