ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు ఆట వస్తువుల సరఫరాకు షార్ట్ టెండర్ ఆహ్వానం…

అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

Published On
ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు ఆట వస్తువుల సరఫరాకు షార్ట్ టెండర్ ఆహ్వానం…

 

ఖమ్మం, సెప్టెంబర్ - 10: లోకల్ గైడ్:

ఖమ్మం జిల్లాలోని మొత్తం 28 పీఎం శ్రీ పాఠశాలలకు ఆట వస్తువులు (Sports Equipment / Materials) సరఫరా చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి షార్ట్ టెండర్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.IMG-20260910-WA0044

జిల్లాలోని 28 పాఠశాలలకు గాను మొత్తం 167 రకాల ఆట వస్తువులను సరఫరా చేయాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ అన్నారు. ప్రతి పాఠశాలకు రూ. 50 వేల చొప్పున మొత్తం రూ. 14 లక్షలు ఇందుకు కేటాయించినట్లు తెలిపారు. ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనదలచిన అభ్యర్థులు ఖమ్మం జిల్లాకు చెందినవారై ఉండాలన్నారు.

 దరఖాస్తు & షెడ్యూల్ రుసుము రూ. 4 వేలు వుంటుందని, ధరావతు సొమ్ము రూ. 50 వేలు 
 డిమాండ్ డ్రాఫ్ట్ జిల్లా కలెక్టరు మరియు ఛైర్మన్, సమగ్ర శిక్ష, ఖమ్మం పేరున తీయాలని అన్నారు. 

జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, కలెక్టరేట్, ఖమ్మం నందు ఈ నెల 15 నుండి నుండి ఈ నెల 17 వ తేదీ సాయంత్రం 05:00 గంటల వరకు మాత్రమే సీల్డ్ టెండర్ దరఖాస్తులు స్వీకరించబడతాయని, నిర్ణీత గడువు దాటిన తర్వాత లేదా తపాలా (Post) ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరని అదనపు కలెక్టర్ తెలిపారు.

టెండర్లను ఈ నెల 19 న ఉదయం 11:00 గంటలకు అదనపు కలెక్టర్ మరియు జిల్లా కొనుగోలు కమిటీ ఛైర్మన్ సమక్షంలో టెండర్లు తెరవబడతాయని, టెండర్ గడువును పొడిగించేందుకు లేదా రద్దు పరిచేందుకు అదనపు కలెక్టర్ మరియు జిల్లా కొనుగోలు కమిటీ ఛైర్మన్  సంపూర్ణ అధికారం కలదని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్.  తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్. 
    రాజేంద్ర నగర్ (లోకల్ గైడ్ ): అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో బి ఆర్ ఎస్ వర్కింగ్
ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు ఆట వస్తువుల సరఫరాకు షార్ట్ టెండర్ ఆహ్వానం…
భాగ్యనగర్ తండా రైల్వే సమస్యపై ఎస్టీ కమిషన్‌కు వినతి
దళిత రైతుల ఆగ్రహం ఉవ్వెత్తున.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి – లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
_కొలన్ హనుమంత రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరైన నాయకులు
పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం.
దళితులను అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి...