కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి-బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                                      

పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్. 

Published On
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి-బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                                      

           

రాజేంద్ర నగర్ ఆగస్టు 17, ( లోకల్ గైడ్ ):                       హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బిఆర్ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్  ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. కేటీఆర్ పిలుపు మేరకు రాజేంద్రనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ సర్కిల్ ముఖ్య నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. హై కోర్ట్ సాకుచూపి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ఈ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, మహిళలు  భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహం కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. ప్రారంభంలో రూ.51 వేలుగా ఉన్న ఆర్థిక సహాయాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచి పేద కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. 
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించారని, కరోనా వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ పేద కుటుంబాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు. 

ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న సీఎం హామీ ఏమైంది....?             కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసే కుట్రకు ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కోసం ఆడబిడ్డలు, వారి కుటుంబాలు ప్రశ్నిస్తుండటంతో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పథకాన్నే ఎత్తివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
హైదర్గూడా డివిజన్ అధ్యక్షులు  నరేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపులను పక్కనపెట్టి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిస్థాయిలో కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మైలార్ దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షులు గుమ్మడి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, తులం బంగారం హామీని నిలబెట్టుకోవాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదయ్య తిరుపతి రెడ్డి రాము యాదవ్ అక్యాo రఘు రాజేష్ యాదవ్ కార్మిక విభాగం అధ్యక్షులు ఉప్పల్ శ్రీనివాస్ జహీర్ ఖాన్ సరికొండ దుర్గేష్ అశోక్ కుమార్ చిరంజీవి రవీందర్ యాదవ్  అరుణ రెడ్డి సరితా మహేష్ సుగుణమ్మ  ప్రసన్న మంజుల పద్మ పుష్ప భాగ్యమ్మ పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు హిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు ‎

Tags:

About The Author

Latest News

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల ఘన నివాళి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల ఘన నివాళి
    తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆయన
సర్వాయి పాపన్న ఆశయాలే బహుజనుల ఆత్మగౌరవానికి మార్గదర్శకం
తెలంగాణ "విప్లవ జ్యోతి" సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
నేడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నిర్వహణ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
పట్టణ ప్రజల సౌకర్యార్థం మేరకే లిటిల్ కార్డు డోర్ డెలివరీ యాప్. 
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.
నవీన్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలి : అడ్డగోడ ఐలయ్య