కొందుర్గు బిజెపి ఆధ్వర్యంలో...

అమర జవాన్ నీరటి చంద్రశేఖర్‌కు ఘన నివాళి

చంద్రశేఖర్ కుటుంబానికి భూమితోపాటు ప్రభుత్వ ఉద్యోగము కల్పించాలని డిమాండ్..
Published On
కొందుర్గు బిజెపి ఆధ్వర్యంలో...

( లోకల్ గైడ్ కొందుర్గు )

కొందుర్గు బిజెపి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుంటూ తంగేళ్లపల్లి, తిరుమనీదేవునిపల్లి గ్రామాల్లో అమర జవాన్ నీరటి చంద్రశేఖర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అమర జవాన్ నీరటి చంద్రశేఖర్‌కు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ఆయన సేవలను స్మరించుకుంటూ దేశభక్తి నినాదాలతో నివాళులు తెలిపారు. నీరటి చంద్రశేఖర్ చేసిన దేశ సేవ, ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం. భారతదేశం కోసం తన ప్రాణాలను అర్పించిన ఆయన త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరచిపోదు. మన దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ప్రతి సైనికుడి త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం మరింత అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు, ఆయన పిల్లల భవిష్యత్తుకు పూర్తి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలు ఒంటరిగా లేవనే భరోసాను ప్రభుత్వం కల్పించాలని, అమర జవాన్ కుటుంబానికి అవసరమైన అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా మరియు ఆర్థిక సహాయాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. “దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ నీరటి చంద్రశేఖర్ త్యాగం వృథా కాదు. ఆయన సేవలు, ఆయన త్యాగం భారత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అమర జవాన్ కుటుంబానికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కక్కునూరు వెంకటేష్ గుప్తా, మాజీ మండల అధ్యక్షులు బలవంత్ రెడ్డి, కొమరబండ శ్రీశైలం, పర్వతాపూర్ సర్పంచ్ బోయ అశోక్, సీనియర్ నాయకులు గుండేటి శివారెడ్డి, శ్రీనివాస్, చెక్కల శ్రీను, ప్రధాన కార్యదర్శులు కార్తిక్ యాదవ్, చందు ముదిరాజ్, బూత్ అధ్యక్షులు రామచంద్రయ్య, గోపి నరసింహులు, చెక్కల నరేష్, లక్ష్మయ్య, పవన్ కుమార్ గౌడ్, రవి, రఘునాథ్ రెడ్డి, రవి గౌడ్, మల్లేష్, ఆవుల శ్రీనివాస్, వెంకటేష్, విక్రమ్, సందీప్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి