విద్యార్థులకు షీ టీమ్స్‌ అవగాహన

Published On
విద్యార్థులకు షీ టీమ్స్‌ అవగాహన

 

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగస్టు 12: 

మహిళలు, బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మల్కాజిగిరి షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో మౌలాలి జెడ్పీహెచ్‌ఎస్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలలపై నేరాలు, సైబర్‌ నేరాలు, లోన్‌ యాప్‌ల మోసాలు, యాంటీ ర్యాగింగ్‌, బాల్య వివాహాలు, గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌, టి-సేఫ్‌ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌-112, వాట్సాప్‌ ద్వారా 8712662111 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Tags:

About The Author

Latest News