ఆగస్టు 25న చంద్రధనలో మెగా హెల్త్, రక్తదాన శిబిరం

లయన్ కొత్త శంకరయ్య స్మారకార్థం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో నిర్వహణ

Published On
ఆగస్టు 25న చంద్రధనలో మెగా హెల్త్, రక్తదాన శిబిరం

లోకల్ గైడ్ – ఆమనగల్లు, ఆగస్టు 24:
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 25న రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు అధ్యక్షులు లయన్ ఎంగలి బాలకృష్ణ తెలిపారు.
లయన్ కొత్త శంకరయ్య గారి స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ మెగా వైద్య శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు, అవసరమైన మందుల పంపిణీ, డయాబెటిస్ పరీక్షలు, కంటి పరీక్షలు తదితర వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచేందుకు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం కొరతతో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు లయన్ ఎంగలి బాలకృష్ణ తెలిపారు.
పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
చంద్రధన గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మెగా హెల్త్ క్యాంప్‌ లో అందించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ పీఆర్వో లయన్ పాషా పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతులైన యువత, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
రక్తదానం మహాదానం – ఆరోగ్య సేవల్లో లయన్స్ క్లబ్ ముందడుగు
సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Tags:

About The Author

Latest News