- District News
- వన మహోత్సవ లక్ష్యాలు గడువులోగా పూర్తి చేయాలి
వన మహోత్సవ లక్ష్యాలు గడువులోగా పూర్తి చేయాలి
రాష్ట్ర అటవీ,దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు.సోమవారం రాష్ట్ర మంత్రి ఛాంబర్,ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్ కుమార్ లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు,జిల్లా అటవీ అధికారులతో వనమహోత్సవం లక్ష్యసాధనపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా 56శాతం లక్ష్యాలను పూర్తి చేసామని,కేటాయించిన లక్ష్యాలను100శాతం పూర్తి చేయాలని తెలిపారు.శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో కృషి చేసి మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.లోటు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయామని,ఇక నుండి కురిసే వర్షాల నీటిని ఒడిసిపట్టి,నిల్వచేసి సెప్టెంబర్ చివరి వారం లోగా 100శాతం లక్ష్యాలను సాధించాలని తెలిపారు.అటవీ శాఖ నర్సరీలలో తగినన్ని మొక్కలు అందుబాటులో ఉన్నాయని,గుర్తించిన ప్రాంతాలలో ఎంపిక చేసిన మొక్కలు నాటాలని తెలిపారు.మొక్కలను నాటడమే కాకుండా సంరక్షణ కూడా చేపట్టాలని,నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చూడాలని,పశువులు, జంతువుల నుండి కాపాడేందుకు నాటిన మొక్కలకు ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.అర్బన్ ఫారెస్ట్ లలో విరివిగా మొక్కలు నాటాలని,మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేయాలని,దేవాలయాల ప్రాంగణాలలో ప్రత్యేకమైన ఎంపిక చేసిన మొక్కలను నాటేందుకు అటవీశాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు.వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయడంలో భాగంగా ప్రజలందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతు జిల్లాలో వనమహోత్సవంలో భాగంగా 41లక్షల మొక్కలను లక్ష్యంగా నిర్ణయించగా,ఇప్పటి వరకు 27లక్షల మొక్కలను నాటామని,నిర్ణీత గడువులోగా 100శాతం లక్ష్యాలను సాధించే దిశగా అధికారుల సమన్వయంతో కృషి చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
