- District News
- Warangal
- నెక్కొండ మండలం తాండాలో విషాదం: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
నెక్కొండ మండలం తాండాలో విషాదం: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
Published On
By Ram Reddy
నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యోదయ హైస్కూల్ కు చెందిన బస్సు కింద పడి ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బస్సు విద్యార్థిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో తండా మొత్తం విషాదంలో మునిగిపోయింది. విద్యార్థి కుటుంబ సభ్యుల రోదనలతో తండా హృదయ విదారకంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక మరేదైనా కారణమా? .పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Oct 2026 14:55:06
మాజీ సర్పంచ్ సుందరి అనిల్ పై సంచలన ఆరోపణలు
