భాగ్యనగర్ తండాలో బోరు బావికి పునరుజ్జీవం

పనుల నాణ్యతపై పీడీ శ్రీరామ్ సంతృప్తి.. సర్పంచ్ హీరాలాల్‌కు అభినందనలు

Published On
భాగ్యనగర్ తండాలో బోరు బావికి పునరుజ్జీవం

 

 

కారేపల్లి , అక్టోబర్ 7 (లోకల్ గైడ్ న్యూస్):

భవిష్యత్‌లో భూగర్భ జలాల కొరతను నివారించడంతో పాటు వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన బోరు బావి పునరుద్ధరణ పనులు భాగ్యనగర్ తండాలో తొలిసారిగా పూర్తయ్యాయి. వర్షపు నీటిని భూమిలోకి మళ్లించే విధానంలో భాగంగా చేపట్టిన ఈ పనులను ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు అధికారి కొండపల్లి శ్రీరామ్ పరిశీలించారు. పనుల నాణ్యత, నిర్మాణ విధానాన్ని పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో భూగర్భ జలాల పరిరక్షణకు ముందడుగు వేసిన సర్పంచ్ బానోత్ హీరాలాల్‌ను అభినందించారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉంటుందని పీడీ శ్రీరామ్ తెలిపారు. భవిష్యత్‌లో నీటి కొరతను ఎదుర్కోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటువంటి పనులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, చేపడుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భాగ్యనగర్ తండాలో చేపట్టిన ఈ పని ఇతర గ్రామపంచాయతీలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారులు చలపతి, శ్రీదేవి, మండల అభివృద్ధి అధికారి పద్మ, సర్పంచ్ బానోత్ హీరాలాల్, సహాయ కార్యక్రమ అధికారి కోటేశ్వరరావు, ఇంజినీరింగ్ అధికారి సుధీర్, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్, సాంకేతిక సహాయకులు రాంబాబు, వసంత్, గ్రామస్తులు గుగులోత్ బాబు, పంచాయతీ సిబ్బంది రాందాస్, హేంచంద్, నంద, లకన్, గణేష్, రమేష్, రాకేష్, రాధా తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News