- District News
- Ranga Reddy
- నేడు జరిగే,ఓబిసి సింహా గర్జన సభను విజయ వంతం చేద్దాం..
నేడు జరిగే,ఓబిసి సింహా గర్జన సభను విజయ వంతం చేద్దాం..
జాతీయ జనగణనలో ఓబిసి లకులగణన లెక్కించాలి...... *ఓబిసి లకు 42 శాతం రిజర్వేషన్ లసాధన కోసం....
లోకల్ గైడ్ న్యూస్ 03 కొందుర్గ్..
శంషాబాద్ లోనీ స్థానిక గొల్లపల్లి రోడ్డు లో నిర్వహించ తలపెట్టిన జాతీయ జనగలనలో ఓ బి సి ల కులగణన.సాధన కొరకు
శంషాబాద్ లో రాష్ట్ర ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడును నేడు మధ్యాహ్నం 3:00 గంటలకు గొల్లపల్లి రోడ్డుశంషాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబడును. కాబట్టి ఓబిసి సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న పిలుపు మేరకు నిర్వహించటం జరుగుతుందని ఆయన అన్నారుఈ ప్రెస్ మీట్ కు కొందుర్గ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొగురి పురుషోత్తం రెడ్డి మరియు షాద్ నగర్ ఏ యం సి చైర్మన్ సులోచన కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ బి సి లకు ఇస్తున్న ప్రాధాన్యత, 42% రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శంషాబాద్ లో నేడు జరిగే ఓబిసి సింహ గర్జనకు కొందుర్గ్ మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు నాయకులు తరలి వెళ్ళాలనిపిలుపునిచ్చారు ఓ బీసీ లకు ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరన్న చేస్తున్న కృషికి మన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుదాం. అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొందుర్గు మాజీ సర్పంచ్ ఫయం,మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లేష్ గౌడ్,రాములు గౌడ్,గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ కాడిగళ్ల మహేందర్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొరిగె యాదయ్య సమన్వయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ ఫయ్యూమ్ భాయ్,రాములు బోరిగే నరేందర్ డైరెక్టర్ భీమారం నన్నయ్య ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మల్లని యాదయ్య గ్రామ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కడిగల్ల పద్మయ్య డా.. జిల్లెల్ల జంగయ్య వార్డ్ సభ్యులు దుర్గను శ్రీను, జిల్లెల్ల ప్రవీణ్ చేవెళ్ల కృష్ణయ్య చీలం వేణు,తీగలపల్లి గోపాల్ మచ్చ అమృతయ్య కొత్త సెల్వ రెడ్డి,పుత్ర రమేష్, నడిమింటి రాజు,మన్మర్రి శశి కుమార్, కుమార్ దుర్గను రాజు తదితరులు పాల్గొన్నారు...
