కాగ్న నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు!

హిటాచీలతో ఇసుక తరలింపుపై రైతుల ఆగ్రహం.. 

పట్టా భూములు కోతకు గురవుతున్నాయని ఆవేదన
Published On
కాగ్న నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు!

లోకల్ గైడ్ /తాండూర్

వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలోని కాగ్న నది నుంచి కొడంగల్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు భారీగా ఇసుక తరలిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టా భూములకు ఆనుకుని ఉన్న నదిలో హిటాచీలతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా 
యాలాల్ మండల కేంద్రానికి చెందిన రైతు శెట్టి రమేష్ మాట్లాడుతూ.. నది ప్రవాహం కారణంగా తమ భూములు కోతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నది మధ్యలో నుంచి మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉండగా, అడ్డదిడ్డంగా తవ్వకాలు చేపట్టడం వల్ల నది ప్రవాహం దిశ మారి పట్టా భూములు కోతకు గురవుతున్నాయని తెలిపారు. ఇసుక వ్యాపారులు నిబంధనలు పట్టించుకోకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి ఇసుక తవ్వకాలను నియంత్రించాలని, తమ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని శెట్టి రమేష్ డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Latest News

రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ
    మోమిన్‌పేట, అక్టోబర్ 30:రాళ్లగుడుపల్లి గ్రామ సర్పంచ్ వర్త్య మహిపాల్ అరాచకాలు గ్రామంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని రాళ్లగుడుపల్లి గ్రామస్తులు ఆరోపించారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన
నిరాధారమైన ప్రచారం చేస్తే చర్యలు తప్పవు!
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తప్పదు!
కాగ్న నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు!
ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి.. వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి: