గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమైనవని. 

ప్రతి ఒక్కరు  అంకిత భావంతో , సమిష్టి కృషితో పట్టభద్రుల ఓట్లు నమోదు గెలిపే లక్ష్యంగా పని చేయాలి. 

బి ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Published On
గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమైనవని. 

 

 

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్.

గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు బి ఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమైనవని, ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో ,అంకిత భావంతో, గెలిపి లక్ష్యంగా పనిచేయాలని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జిల్లా  పార్టీ కార్యాలయం లో జరిగిన నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నన్ను మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి  ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే,ఎటువంటి ఆలోచన చేయకుండానే వస్తానని మాటిచ్చానని ,కారణం వారు నల్లగొండ నియోజకవర్గ ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్న విధానం.. జిల్లా కలెక్టర్ నుండి ఎస్సై వరకు.. వారి తప్పిదాలను నిలదీస్తూ విరోచితంగా పోరాడుతున్నారని... నల్లగొండ మంత్రి.. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల విఫలమైన తీరు, అవినీతిమయమైన వారి వ్యవహారం.. అభివృద్ధిని గాలికి వదిలేసి నిర్లక్ష్యం వహిస్తున్న వారి తీరు పట్ల కంచర్ల తీవ్రంగా ప్రతిఘటించి వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారని,ఎండ వేడిమి లో కూడా వారికి చలి వణుకు పుట్టిస్తున్నారని.. అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి అనేక కుయుక్తులు పన్నుతారని, డబ్బులను వెరవేసి,అధికారం ఆశ చూపి, అబద్ధపు ప్రచారం చేస్తారని,వారి ప్రలోభాలకు లోను కాకుండా పార్టీ నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని, ఉదాహరణల పూర్వకంగా.. సభలో చెప్పి ఆకట్టుకున్నారు.బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి పెద్ద ఎత్తున మెజార్టీ, నల్లగొండ నియోజకవర్గంలో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి  మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ కు, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మట్టి కరిపించి గట్టిగా బుద్ధి చెప్పాలని.. ఈ గెలుపు.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది కావాలని..ఇందుకు ప్రతి గ్రామ,డివిజన్, నాయకులు నల్లగొండ నియోజకవర్గంలో ఎక్కువగా, పట్టభద్రులను ఓటర్లుగా నమోదు  చేయించాలని  కోరారు.ఏనుగుల రాకేష్ రెడ్డి  మాట్లాడుతూ గత ఎన్నికలలో 14 రోజుల ముందు నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, ప్రత్యేకంగా ఓటర్లను నమోదు చేయనప్పటికీ,కొద్ది ఓట్ల మెజార్టీతో ఓడిపోయానని, అయినప్పటికీ అధైర్య పడకుండా నేను సువిశాలమైన ఈ.. పట్టభద్రులను నియోజకవర్గంలో కాలికి బల్పo కట్టుకుని తిరిగానని పట్టభద్రుల సమస్యలపై స్పందించి సమస్యల పరిష్కారం కోసం పోరాడానని నారు. గతంలో పార్టీ పరంగా ఓట్లు నమోదు చేయించక పోవడం వల్ల, నష్టం జరిగిందని అయినా గట్టి పోటీ ఇచ్చామని,ఈసారి ఆ పొరపాటు జరగకుండా, పట్టభద్రులను ఓటర్ల గా నమోదు చేయించాలని కోరారు. ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్.. ఉద్యమకారులు బ్రాహ్మణ పరిషత్ మాజీ సభ్యులు చకిలం అనిల్ కుమార్, మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి.. రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి... మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, అభిమన్యు శ్రీనివాస్, మైనం శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్రావు  నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కనగల్ తిప్పర్తి నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య పల్ రెడ్డి రవీందర్ రెడ్డి దేప వెంకట్ రెడ్డి... జి ఎడవెల్లి సింగిల్ విండో చైర్మన్ తోటి శ్రీనివాస్, కార్పొరేటర్లు.. మారగొని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కొండూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, బాణావత్  దీప్లా, దొడ్డి రమేష్ గోపగోని స్వాతి రాజశేఖర్.బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య ,సింగం లక్ష్మి, యాట జయప్రద రెడ్డి, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి  జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి 
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం  గున్ముకుల   గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
గేట్ కారేపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.
సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ