- District News
- Ranga Reddy
- షాద్నగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ – కేశంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
షాద్నగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ – కేశంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
లోకల్ గైడ్ తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం
ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పౌరులు, పార్టీలకు అతీతంగా అనేకమంది దేశభక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, హర్ ఘర్ తిరంగా జిల్లా అధ్యక్షులు అమడపురం నరసింహ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి , రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు మనోహర్ రెడ్డి, షాద్నగర్ కార్యక్రమ ఇన్‌చార్జ్ కొండోజు వంశీకృష్ణ, ఇన్‌చార్జ్ సుధాకర్ రావు పాల్గొన్నారు.
అలాగే మండల అధ్యక్షురాలు రాధిక గౌడ్ గారు, బీజేవైఎం అసెంబ్లీ ఇన్‌చార్జ్ పుట్నాల సాయికుమార్ , ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు పసుల నరసింహ యాదవ్ , సుప్పరి నరసింహ , జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచుకోట మహేష్, ప్రధాన కార్యదర్శులు తిరుపతి, నర్సింలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరంగ యాత్ర ముగిసిన తర్వాత స్థానికంగా సమావేశం నిర్వహించి రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జరుగనున్న తిరంగా ర్యాలీకి షాద్ నగర్ నియోజకవర్గం మరియు కేశంపేట మండలం నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీ నీ విజయవంతం చేసి జాతీయ స్పూర్తి ని చాటాలని జిల్లా అధ్యక్షులు శ్రీ పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ తెలపడం జరిగింది.
జాతీయ జెండా మన గౌరవం… దేశభక్తి మన బాధ్యత!
ప్రతి ఇంటా తిరంగా – ప్రతి గుండెలో దేశభక్తి!
