పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తప్పదు!

అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించాలి – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

Published On
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తప్పదు!

IMG-20261030-WA0167

లోకల్ గైడ్ ఆమనగల్లు, అక్టోబర్ 30:

అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ చూపాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్య నాయక్, డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు అవ్వారి శివలింగంతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, విద్య, ఉద్యోగ రంగాల్లో నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాలన, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పట్టభద్రుల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని, నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి ఎవరికీ ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి రాకుండా చూడాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఓటరు నమోదు కేంద్రం ఇన్‌చార్జులు ఎంగలి ప్రసాద్, నాగిళ్ల వెంకటేష్, డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ప్రశాంతి రవికుమార్, మాజీ ఎంపీపీ అనిత విజయ్, ఆదివాసీ రాష్ట్ర సమన్వయకర్త కృష్ణ నాయక్, ఎం.ఏ. ఖలీల్, మాజీ వార్డు సభ్యుడు పూసల సత్యం, కొండల్‌రెడ్డి, అబ్దుల్ అలీమ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఫరీద్, నియోజకవర్గ నాయకులు ఫిరోజ్, శ్రీనాయక్, మల్లేష్ నాయక్, గుద్దేటి శివ, కుమార్ గౌడ్, నాజర్, రఫీ, పూసల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ
    మోమిన్‌పేట, అక్టోబర్ 30:రాళ్లగుడుపల్లి గ్రామ సర్పంచ్ వర్త్య మహిపాల్ అరాచకాలు గ్రామంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని రాళ్లగుడుపల్లి గ్రామస్తులు ఆరోపించారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన
నిరాధారమైన ప్రచారం చేస్తే చర్యలు తప్పవు!
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తప్పదు!
కాగ్న నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు!
ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి.. వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి: