- District News
- రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ
రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ
Published On
By Ram Reddy
రాళ్లగుడుపల్లి గ్రామ సర్పంచ్ వర్త్య మహిపాల్ అరాచకాలు గ్రామంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని రాళ్లగుడుపల్లి గ్రామస్తులు ఆరోపించారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ... ఒక రైతు పొలం పనులు చేసుకుంటుండగా అడ్డుకొని ఆయనపై దౌర్జన్యం చేసి, దాడికి పాల్పడ్డారని తెలిపారు. అంతేకాకుండా, అడ్డువచ్చిన గ్రామ పెద్దలైన ఆశిరెడ్డి, లక్ష్మయ్య, గోపాల్, మేఘావత్‌లపై పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు.
గ్రామ పంచాయతీ చెత్త వాహనాన్ని తమ ఇంటి వద్దే ఉంచుకుంటూ, వాటర్ ట్యాంకర్లను సైతం తమ కుటుంబీకులకు, అనుచరులకు మరియు మామూళ్లు ఇచ్చిన వారికే అందుబాటులో ఉంచుతున్నారని మండిపడ్డారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు కూడా చేయడం లేదని, గ్రామసభ నిర్వహించకుండానే సంతకాలు సేకరించి వెళ్లిపోతున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చౌహాన్ నర్సింహులు, వార్డు సభ్యులు అంజయ్య, గోపాల్, గ్రామ నాయకులు సర్దార్, ఆశిరెడ్డి, లక్ష్మయ్య, జగదీష్, లక్ష్మయ్య, ప్రతాప్, పాండు, రవికుమార్, బిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
31 Oct 2026 11:29:07
మోమిన్‌పేట, అక్టోబర్ 30:రాళ్లగుడుపల్లి గ్రామ సర్పంచ్ వర్త్య మహిపాల్ అరాచకాలు గ్రామంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని రాళ్లగుడుపల్లి గ్రామస్తులు ఆరోపించారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన
