- District News
- Warangal
- మొక్కలు నాటిన యువనేత విష్ణువర్ధన్ రెడ్డి
మొక్కలు నాటిన యువనేత విష్ణువర్ధన్ రెడ్డి
ప్రతి శనివారం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి*
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు08
(లోకల్ గైడ్ న్యూస్)
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి శనివారం 60వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బ్యాంక్ కాలనీలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సుమారు 20 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణకు బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
22 Aug 2026 21:30:17
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
