_నార్త్ హైదరాబాద్‌లో నంబర్‌ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీగా గుర్తింపు

_ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ కిరణ్మయి, ఎండీ రాకేష్‌కు అభినందనల వెల్లువ

Published On
_నార్త్ హైదరాబాద్‌లో నంబర్‌ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీగా గుర్తింపు



కుత్బుల్లాపూర్ ఆగస్టు 09 (లోకల్ గైడ్ ప్రతినిధి)


రియల్ ఎస్టేట్ రంగంలో విశేష సేవలు, నాణ్యమైన ప్రాజెక్టులు, వినియోగదారుల విశ్వాసంతో ముందుకు సాగుతున్న సంస్థకు నార్త్ హైదరాబాద్‌లో నంబర్‌ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ కిరణ్ మై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ అవార్డును అందుకోవడం పట్ల సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.సంస్థ సాధించిన ఈ గుర్తింపును పురస్కరించుకుని నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో సంస్థకు చెందిన ప్రతినిధులు, ఉద్యోగులు, సన్నిహితులు పాల్గొని సంస్థ ఎండీ రాకేష్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, నాణ్యత, కస్టమర్ సంతృప్తికి ప్రాధాన్యతనిస్తూ సంస్థ ముందుకు సాగడం వల్లే ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కిందని నిర్వాహకులు తెలిపారు. నార్త్ హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎండీ రాకేష్ మాట్లాడుతూ, సంస్థపై నమ్మకం ఉంచిన కస్టమర్లు, సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగులు, భాగస్వాములు, శ్రేయోభిలాషుల సహకారమే ఈ అవార్డు సాధించడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరింత నాణ్యమైన సేవలను అందిస్తూ కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.
నార్త్ హైదరాబాద్‌లో నంబర్‌ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీగా లభించిన ఈ అవార్డు సంస్థ విజయపథంలో మరో మైలురాయిగా నిలిచిందని పలువురు అభినందించారు. ఎండీ రాకేష్‌కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...