ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు

Published On
ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వి రాములు అన్నారు.శనివారం జిల్లాలోని నస్పూర్,మంచిర్యాల మండలాల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా గుర్తించిన అనామోలీస్ ను పరిశీలించి,సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను చేపట్టాలని,నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.తహసిల్దార్ కార్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న ధ్రువపత్రాల సంబంధిత దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి,క్షేత్రస్థాయిలో విచారణ చేసి నిర్ణీత సమయంలోగా జారీ చేయాలని తెలిపారు.సాదా బైనామా,భూభారతి,రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులను అనుసరించి పరిష్కరించాలని తెలిపారు.పెండింగ్ వ్యవహారాలను త్వరితగతిన పరిష్కరించి,నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని,ఎస్‌ఐఆర్ ప్రక్రియ,రెవెన్యూ సంబంధిత పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసిల్దార్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం