_దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జలిగం రాకేష్

_అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జలిగం రాకేష్

Published On
_దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జలిగం రాకేష్

 

 

కుత్బుల్లాపూర్ అక్టోబర్ 17 (లోకల్ గైడ్ ప్రతినిధి)

 

131వ డివిజన్ పరిధిలోని మాణిక్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జలిగం రాకేష్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.ఈ ఆహ్వానం మేరకు ఉత్సవాలకు హాజరైన జలిగం రాకేష్ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాణిక్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షులు మహేష్, ఖాలిల్, దుబాయ్ రాజు, హారన్ రెడ్డి, చరణ్, భాను, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.జలిగం రాకేష్తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కుత్బుల్లాపూర్

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు! కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!
        కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి
థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. 
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్