- District News
- రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో తాండవ కృష్ణ ప్రతిభ
రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో తాండవ కృష్ణ ప్రతిభ
జడ్‌పీఎస్ఎస్ పాఠశాలలో ఘనంగా అభినందన...
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు,ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చిన తాండవ కృష్ణను జడ్‌పిఎస్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి రఘుబాబు,పిఈటి కిన్నెర పద్మ,పలువురు ఉపాధ్యాయులు,విద్యార్థులు అభినందించారు.ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈనెల11నుండి13వరకు బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో తాండవ కృష్ణ తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జట్టు ప్రథమ స్థానంలో నిలిచేందుకు చేసిన కృషి,పట్టుదల,క్రమశిక్షణతో చేసిన సాధన అభినందనీయమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని,క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం,క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన అన్నారు.తాండవ కృష్ణ భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.రాష్ట్ర సాయి పోటీల్లో రాణించి పాఠశాలకు కీర్తి గడించిన తాండవ కృష్ణను ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంధ్యారాణి,రాజేశ్వరి,వెంకటేశ్వర్, సునీత,సత్యనారాయణ,శివ,వసంత్, రత్నం,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
