నారాయణపేట మే 30:
రైతు పండించిన ధాన్యం ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది నందు నామాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కానీ కేంద్రం సహకరించడం లేదని రాష్ట్ర మంత్రులు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నా రు.తెలంగాణ రాష్ట్రంలో రైతు లు ఎంతో కష్టపడి పండించి న వడ్లు కొనుగోలు కాక కొనుగోలు కేంద్రాల వద్దే పేరుకుపో తున్నాయనీ రైతుల బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.రోజుల తరబడి ఎదురు చూస్తున్న రైతులకు సరైన సదుపా యాలు లేక తీవ్ర ఇబ్బందు లు పడు తున్నారని ఆవేశం వ్యక్తం చేశారు. ఇప్ప టికే అకాల వర్షాలతో వడ్లు తడిసిపోవ డంతో రైతులు భారీ నష్టా లను చవిచూస్తు న్నారన్నా రు.పండించిన పంటకు ధర రాక, కొనుగోలు ఆలస్యం కావడం, తడిసిన ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతు ఆవేదనలో ఉన్నా డనీ అన్నారు.రైతు చెమట తో పండిన ప్రతి గింజకు విలువ ఇవ్వాల్సిన ప్రభు త్వం, రైతు ల కన్నీళ్లు కనిపిం చకపో వడం దురదృష్ట కరనన్నా రు.రైతుల సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?అని ప్రశ్నించారు.రైతు కష్టం గుర్తు కురాకపోతే, రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నా రు.వెంటనే వడ్ల కొను గోళ్లను వేగవంతం చేయా లనీ, అకాల వర్షాలతో నష్ట పోయి న రైతులకు తక్షణ పరిహారం అందించాలనీ, రైతును ఆదుకునే చర్యలు వెంటనే చేపట్టాలనీ డిమాం డ్ చేశారు.కానీ ఆడలేక మద్దెల ఓడిందన్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరి స్తున్నదని అన్నారు.రైతులు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు.
ఫోటో రైట్ అప్:8.నందు నామాజీ
_______________________