ఈ నెల 25 న నిజామాబాదు కు తెలంగాణ గవర్నర్ రాక

Published On
ఈ నెల 25 న నిజామాబాదు కు తెలంగాణ గవర్నర్ రాక

 

నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 24: 
         తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆగస్టు 25న (మంగళవారం) నిజామాబాద్ జిల్లా లో పర్యటించనున్నారు. నగరంలోని పసుపుబోర్డు కార్యాలయంలో రైతులతో మార్కెట్​ లింకేజ్​ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజు 
 ఉదయం 10.20 గంటలకు ఇందూరుకు వస్తారు . ఆగస్టు 25న ఉదయం 9:15 గంటలకు లోక్ భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ ఐడీవోసీ హెలిప్యాడ్‌కు 10:20 గంటలకు వస్తారు. ఆ తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, నేషనల్ టర్మరిక్​ బోర్డులో రైతులతో మార్కెట్ లింకేజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పీహెచ్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్​లో అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చేపట్టనున్న ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సాయంత్రం 3:20 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

Tags:

About The Author

Latest News