- District News
- Ranga Reddy
- ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 వ తేదీన గ్రామ/వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు,ఈ.ఆర్.ఓ లు, ఎ.ఈ.ఆర్.ఓ. లతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా గ్రామ/వార్డు సభల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎస్ఐఆర్ లో భాగంగా ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామ/వార్డు సభలు నిర్వహించి ముసాయిదా ఓటర్ల జాబితా, ఎ.ఎస్.డి.(ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితా బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్ల సమక్షంలో చదివి వినిపించాలని తెలిపారు. గ్రామ/వార్డు సభల నిర్వహణ సమయంలో బూత్ స్థాయి అధికారులు ఫారం-6, 7, 8 అందుబాటులో ఉంచుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నోట్ చేసుకోవాలని తెలిపారు. అనామోలీస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు సంబంధించిన వివరాలు బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని, పెండింగ్ లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నోటీసులు అందించాలని తెలిపారు. అవసరం ఉన్నచోట అదనపు ఎ.ఈ.ఆర్.ఓ.ల సంబంధిత ప్రతిపాదనలు రేపటి లోగా పంపించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియలో ప్రస్తుతం కేవలం 3,355 నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించిన కార్యాచరణ ప్రకారం ఈ నెల 27న జిల్లాలోని గ్రామాలు, వార్డుల్లో సభలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదనపు ఏ.ఈ.ఆర్.ఓలకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా పంపించినట్లు వెల్లడించారు.
