రేణుక ఎల్లమ్మ పల్లకి సేవలో  పూజారి పాండు.

తాండూర్ ప్రజలను చల్లగా చూడాలని పూజారి పాండు ప్రార్థన

అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న కాంగ్రెస్ నాయకుడు సత్యమూర్తి
Published On
రేణుక ఎల్లమ్మ పల్లకి సేవలో  పూజారి పాండు.

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సోమవారం అమ్మవారి పల్లకి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు పూజారి పాండు పల్లకి సేవలో పాల్గొనీ మొక్కులు చెల్లించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...రేణుక ఎల్లమ్మ తల్లి కృపాకటాక్షాలు తాండూర్ ప్రజలపై, ముఖ్యంగా వాల్మీకి నగర్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సత్యమూర్తి వార్డు కౌన్సిలర్ అంతరం కిరణ్ హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పల్లకి సేవలో అధ్యక్షుడు దరిమితి రవి పూజారి పాండు మహిళా మండలి సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ నేపథ్యంలో తాండూర్ పట్టణంలోని పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు,భజన మండలి సభ్యులు, కాలనీవాసులు,భక్తులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

దసరా వేడుకల్లో ఆత్మీయ పలకరింపు. దసరా వేడుకల్లో ఆత్మీయ పలకరింపు.
లోకల్ గైడ్/తాండూర్:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాలాల్ పీఏసీఎస్ చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్‌కు అక్కంపల్లి గ్రామ పెద్దలు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఆయనను ఆత్మీయంగా కలిసి...
మానవత్వానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అండ.. పేద మహిళకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ!
రేణుక ఎల్లమ్మ పల్లకి సేవలో  పూజారి పాండు.
టి ఐ సి సి ఐ తెలంగాణ రాష్ట్ర చాప్టర్,రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఎన్. బాలు మహేంద్ర నాయక్ నియామకం .
అమ్మవారి ఆశీస్సులతో తాండూరు సుభిక్షంగా ఉండాలి.
_రామకృష్ణ అన్న కుటుంబంలో ఘనంగా దసరా ఉత్సవాలు
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.