సినీ నటుడు నాని గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

పసుపు,కుంకుమ, చీర,సారె సమర్పించి మొక్కులు చెల్లించిన  నటుడు నాని

Published On
సినీ నటుడు నాని గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్29
(లోకల్ గైడ్ న్యూస్)

ది ప్యారడైజ్’
సినిమాలో నటించిన ప్రముఖ సినీ నటుడు నాని, ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు. ఉదయం 11 గంటల సమయంలో జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. సినీ బృందం గట్టమ్మ ఆలయానికి చేరుకోగానే టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. అనంతరం నాని గట్టమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు సినీ బృందం బయలుదేరింది.అనంతరం ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారానికి చేరుకున్న 'ది ప్యారడైజ్' సినీ బృందానికి గిరిజన పూజారులు డోలు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం నాని తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించారు. గద్దెల ప్రాంతానికి చేరుకున్న సినీ బృందానికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాని సమ్మక్క-సారలమ్మ తల్లులకు పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నానితో పాటు మరో నటుడు సంపూర్ణేష్ బాబు, సినీ నిర్మాత సుధాకర్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News