తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 

- సినీ నటులు బాబు మోహన్ 

అంతర్జాతీయ ప్రమాణాలతో “చిరంజీవి వెరికోస్ వాస్కులర్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్” ప్రారంభం
Published On
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 




కుత్బుల్లాపూర్ ఆగస్టు 23 (లోకల్ గైడ్ ప్రతినిధి)

సామాన్యులకు ప్రైవేట్ ఆసుపత్రుల సేవలు చాలా ఖరీదైనవిగా ఉంటున్నాయని, తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలని సినీ నటులు, మాజీ ఎమ్యెల్యే, బాబు మోహన్ కోరారు. హైదరాబాద్, కొండాపూర్ లో ఆదివారం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన “చిరంజీవి వెరికోస్ వాస్కులర్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్లానింగ్ అండ్ లాజిస్టిక్స్ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ భోపాల్ గజరావు తోకలసి బాబు మోహన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను బాబు మోహన్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వెరికోస్ వెయిన్స్, కాళ్లలో రక్తనాళాల సంబంధిత సమస్యలు, ఇతర వాస్కులర్ వ్యాధులకు ఆధునిక వైద్య విధానాలతో నాణ్యమైన చికిత్స అందించాలనే లక్ష్యంతో ఆధునిక వైద్యసదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం అని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఇటువంటి వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్వాహకులు, ప్రముఖ వెరికోస్ వెయిన్స్ నిపుణులు డాక్టర్ కె. సంజీవరావు, డాక్టర్ శిల్ప పొన్నాడ, ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ కె. వంశీకృష్ణ లు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చిరంజీవి వెరికోస్ వాస్కులర్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించామని తెలిపారు. రోగులకు సులభంగా, సమర్థవంతంగా వైద్య సేవలు అందించేందుకు అధునాతన వైద్య సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు,సమగ్రచికిత్సావిధానాలనుఅందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. “ప్రతి అడుగులో ఆరోగ్యం – ప్రతి జీవితంలో నమ్మకం” అనే లక్ష్యంతో వెరికోస్ వెయిన్స్‌తో పాటు వివిధ విభాగాల్లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు అందించనున్నట్లు వెల్లడించారు. ఏ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, రంగస్థల దర్శకులు ఈ. సముద్ర, వీరభద్ర చౌదరి, తెలంగాణ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు అన్నంగి రాజశేఖర్, నిర్మాత మిత్తాన ఈశ్వర్, హీరోయిన్ సైనిక తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం  ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం 
        కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్): ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ
డీసీసీ అధ్యక్షుడితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ.
ప్రశ్నిస్తే లాఠీలేనా? బీజేపీని నిలదీసిన గుడిపూడి తిరుమల రావు
మూడు నెలలుగా నిలిచిన 'భగీరథ'.. 
జోరుగా ఇసుక అక్రమ రవాణా!
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలి, 
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్