- District News
- Khammam
- గేట్ కారేపల్లిలో నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
గేట్ కారేపల్లిలో నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
భక్తుల సౌకర్యార్థం పెద్ద చెరువును క్లియర్ చేయించిన సర్పంచ్ పూసం ఎల్లయ్య
కారేపల్లి , సెప్టెంబర్ 22 (లోకల్ గైడ్ న్యూస్) :
గేట్ కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంచాయతీ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా పరిధిలోని పెద్ద చెరువు ప్రాంతాన్ని డోజర్‌తో క్లియర్ చేయించి నిమజ్జనానికి అనువుగా సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లను సర్పంచ్ పూసం ఎల్లయ్య ప్రత్యేకంగా పర్యవేక్షించారు. నిమజ్జన సమయంలో భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువు పరిసరాలను శుభ్రం చేసి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయించారు. పంచాయతీ కార్యదర్శి కె. అనూష, ఉపసర్పంచ్ కందుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లను సమన్వయం చేశారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సౌకర్యవంతంగా జరిగేలా పంచాయతీ తరఫున చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మూడు లక్ష్మణ్, షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు.
