- District News
- Khammam
- కారేపల్లి గణనాథుడి సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు
కారేపల్లి గణనాథుడి సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు
పాత సొసైటీ కార్యాలయం వద్ద వినాయకుడి దర్శనం.. అన్నదానంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 21 (లోకల్ గైడ్ న్యూస్) : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కారేపల్లి పాత సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమల రావు సందర్శించారు. తన చిన్ననాటి పాఠశాల మిత్రుడు పరిటాల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో గణనాథుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులతో కారేపల్లి, సింగరేణి మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి–సమృద్ధులతో జీవించాలని ఆకాంక్షించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించిన గుడిపూడి తిరుమల రావు, ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ టోనీ, వోరికొర్ల వీరభద్రం, సామినేని తిరుపతిరావు, పొట్లకాయల మహేష్, యాకూబ్, సత్యనారాయణ, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
