ఉచిత యూనిఫామ్‌తో సమానత్వానికి బాట

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయి : బాణోతు లక్ష్మ

Published On
ఉచిత యూనిఫామ్‌తో సమానత్వానికి బాట

 

 

టేకులపల్లి, వాగొడ్డు తండా, సెప్టెంబర్ 25 (లోకల్ గైడ్ న్యూస్) :

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలను అందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫామ్, టై, బెల్ట్‌లను శుక్రవారం వాగొడ్డు తండా ఎం.పి.పి.ఎస్‌లో విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు భూక్యా వీరన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బాణోతు లక్ష్మ మాట్లాడుతూ, ఉచిత యూనిఫామ్‌తో విద్యార్థుల్లో సమానత్వం, ఐక్యత, క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నారు. విద్యార్థులందరూ ఒకే విధమైన యూనిఫామ్ ధరించడం ద్వారా ‘అందరం ఒక్కటే’ అనే భావన బలపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని లక్ష్మ సూచించారు. క్రమశిక్షణతో నడుచుకుంటూ ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు భూక్యా వీరన్న మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సౌకర్యం వారికి చేరేలా పాఠశాల తరఫున కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ శుభ్రమైన యూనిఫామ్‌తో పాఠశాలకు హాజరై, చదువుతో పాటు మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు మాలోత్ రాణి, మాలోత్ చైతన్య, లకావత్ భానుప్రియతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News