ఘనంగా వ్యవసాయ సహకార సంఘాల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం.. 

నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు

Published On
ఘనంగా వ్యవసాయ సహకార సంఘాల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం.. 

IMG-20260921-WA0399హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్
(లోకల్ గైడ్ న్యూస్)
 హనుమకొండ,నూతనంగా ఎన్నికైన హసన్పర్తి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పింగిలి వెంకట రామ నర్సింహారెడ్డి, మల్లారెడ్డిపల్లి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బయ్యగొని కుమారస్వామి గౌడ్, పాలకవర్గం పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి పాల్గొని నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు నూతన పాలకవర్గాలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఇనుగాల  వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో
వరంగల్ గ్రేన్ మార్కెట్ ఛైర్మన్ పులి ప్రియాంక, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాకేష్ రెడ్డి,  మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు తిరుపతి, మహేందర్ రెడ్డి, విసం సురేందర్ రెడ్డి, కొంక హరిబాబు, రాము గౌడ్, శివ ప్రసాద్, గొర్రె కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి