కాటారంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

Published On
కాటారంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

 

కాటారం, ఆగస్టు 19, లోకల్ గైడ్

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ అయ్యప్ప ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మండల కేంద్రంలో సమావేశమై ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ్యులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుల శివ మాట్లాడుతూ కాలానికి ఆగే శక్తి లేదని, కానీ ఆ కాలాన్ని ఆపే అద్భుత శక్తి కేవలం కెమెరాకు మాత్రమే ఉందన్నారు. వేగంగా గడిచిపోయే కాలంలో మనుషుల జీవితాల్లోని అమూల్యమైన క్షణాలను బంధించి, వాటిని జీవితాంతం తీపి గుర్తుగా మిగిల్చే అదృష్టం ఫోటోగ్రాఫర్లకే దక్కిందని కొనియాడారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త మెళకువలు నేర్చుకుంటూ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుమ్మడి సందీప్, ఉపాధ్యక్షుడు తోట మాధవ్, ప్రధాన కార్యదర్శి బొల్లెడ్ల రాజబాబు, కోశాధికారి నారా నరేందర్, జిల్లా కుటుంబ భరోసా ఇన్‌చార్జి తోెంబర్ల రాజేంద్రప్రసాద్, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి పారిపెల్లి శ్యామ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కాటారపు రమేష్, సామ్రాట్, మేకల రమేష్, నల్లవేణి దేవేందర్, ఏనుగుల ప్రకాష్, అయిటిపాముల శ్రావణ్, అంగడి ప్రసాద్, దినేష్, సత్యం, ఎండి ఖలీల్ పాషా, బింగి ధను, మహిళా ఫోటోగ్రాఫర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...