న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహణ వైఫల్యం… ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్న నిర్వాహకుల నిర్లక్ష్యం! 

న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహణ వైఫల్యం… ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్న నిర్వాహకుల నిర్లక్ష్యం! 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)
నిజామాబాద్ నగరంలోని ప్రముఖ కార్యక్రమాలకు వేదికగా మారిన న్యూ అంబేద్కర్ భవన్‌ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం కళ్లకు కనబడుతున్న అధికారులకు నిర్వాహకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు వందల మంది పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు వేలాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తుంటారు..ప్రతి వారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రస్థాయి నేతలు, వందలాది ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలు జరుగుతున్నాయి…న్యూ అంబేద్కర్ భవన్ నిర్వహణ బాధ్యత వహిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
స్టేజ్‌ ఎక్కే దారిలోనే వెలుగు కనిపించే స్థాయిలో విద్యుత్‌ సరఫరా అయ్యే బోర్డులు విరిగిపోయి, విద్యుత్ తీగలు బహిరంగంగా వేలాడుతున్నట్టు కనిపిస్తున్నాయి. అవి మరమ్మత్తులు లేకుండా అలాగే వదిలేయడమేగాక, ఎప్పుడైనా షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే అవకాశం ఉంది. ఇది చిన్నపిల్లలు, మహిళలు, పెద్దలు చుట్టూ తిరుగుతున్న ప్రాంగణంలో ప్రమాదకరంగా మారింది. కానీ అక్కడి నిర్వాహకుల కళ్లకు మాత్రం కనబడడం లేదు..ఈ భవన్‌ కు ప్రభుత్వ పెద్దలు తరచూ వస్తుంటారు. అలాంటి స్థలంలో అసురక్షితమైన విద్యుత్ వ్యవస్థ ఉండటం సిగ్గుచేటు... ప్రజా భద్రత పట్ల అధికారుల అలసత్వం, వ్యవస్థలో తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది.స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తక్షణమే మెరుగైన నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. విద్యుత్ ప్రమాదం జరగకముందే స్పందించాలని తెలంగాణ లోకల్ గైడ్ జాతీయ దినపత్రిక ప్రజా సంక్షేమర్థం కోరుతోంది.. సంపాదకులు నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నక్కరాకేష్

Tags:

About The Author

Latest News

*గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా  *గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా 
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్డాక్టర్ మంతెన రవికుమార్ ను తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో...
అప్పుడే పుట్టిన శిశువును చీకట్లో పారవేసిన వేసిన తల్లి కుటుంబ సభ్యులు...
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంట 
ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
బీడీ వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం...
*అంబరాన్నంటిన ఊర పండుగ..
విక్రయించిన పసికందును సోలాపూర్ నుండి సురక్షితంగా తీసుకొచ్చిన నిజామాబాద్ పోలీసులు...